News
కలలుగన్న తెలంగాణ ఇప్పుడు లేదు
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంతరెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొరల పక్షమో? బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పనిచేసే టీడీపీ పక్షమో? తెలంగాణ సమాజం తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో, టీడీపీఅధినేత చంద్రబాబు అండతో తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌పై టీడీపీ యుద్ధం ప్రకటించిందన్నారు. తెలంగాణ సమాజానికి సీఎం కేసీఆర్‌ను భరించే ఓపిక లేదని, ఆయన్ను కుర్చీలోంచి దించేందుకు కంకణం కట్టుకుందన్నారు. రైతు పోరుయాత్ర ము గింపు సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం కోస్గి లో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌పై రేవంత నిప్పులు చెరిగారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్, విమలక్క వంటి వారు గజ్జెకడితేనే, ఉస్మానియా విద్యార్థులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. 2009 ఎన్నికల్లో కొడంగల్‌లోని దొరల గడీపై టీడీపీ జెండా ఎగురవేసిందంటూ 2019 ఎన్నికల్లో హైదరాబాద్ పంజాగుట్టలోని కేసీఆర్ గడీపైనా టీడీపీ జెం డా ఎగురవేస్తామన్నారు. తాము వాటర్ గ్రిడ్ కమీషనలో వాటా అడగలేదని, మిషన కాకతీయలో కమీష న్లు అడగలేదని, బతుకమ్మ బడ్జెట్‌లో భాగం అడగలేద ని, సీఎం కుర్చీల్లో రెండేళ్లు కూర్చుంటామని కూడా అడగలేదన్న రేవంత.. రైతులకు రుణమాఫీ చేయాలని, బ్యాంకుల్లో ఉన్న పేదోడి పాస్‌బుక్కులను విడుదల చేయాలని, తెలంగాణ రైతు బిడ్డలను కాపాడాలని, రూ.790 కోట్ల ఇనపుట్ సబ్సిడీ ఇవ్వాలని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేయడం నేరమా? అన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం ప్రమాదపుటంచులను చేరిందన్న రేవంత రెండున్నరేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల నెత్తి న భారీ అప్పు రుద్దిందన్నారు. సామాజిక న్యాయం అందించే పాలన, పేదలను కడుపులో పెట్టుకునే ప్రభుత్వం అవసరమన్నారు. పేదలకు అండగా నిలబడేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








